చేంగాళ్ళమ్మ తిరునాళ్ళు ఏర్పాట్లు పరిశీలించిన 

ఎమ్మెల్యే ,ఎంపీపీ ,ఆలయ చైర్మన్.

మహిసాసుర మర్దినికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి. 

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట పట్టణంలో కాళంగి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం తిరునాళ్ళు 

జూలై నెల 8 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు జరపడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ తిరునాళ్లలో ప్రధాన ఘట్టముగా చెప్పుకునే మహిషాసుర మర్దిని వేడుకను 

నిర్వహించే మైదానాన్ని బుధవారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తో పాటు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి,ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పరిశీలించారు, మహిసాసుర 

మర్దన వేడుకను ప్రతి భక్తుడు కనులారా వీక్షించి తరించే విధముగా ప్రత్యేక ఏర్పాట్లు 

చేయడానికి నిర్ణయం తీసుకున్నారు,మైదానం మధ్యలో ఒక ర్యాంపు ఏర్పాటు చేసి 

దాని పైన మహిషాసురమర్దని వేడుక జరిపించాలని దీనివలన ప్రతి భక్తుడు వేడుకను 

చూడటానికి అవకాశం కలుగుతుందని ఈ ప్రత్యేక ఏర్పాట్లకు నిర్ణయం తీసుకున్నారు,

ఈ విశాలమైన మైదానం లో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ సారి భక్తులకు 

వేడుకల్లో పాల్గొనే అవకాశం ను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో వైసీపీ నేత జెట్టి వేణు యాదవ్, కౌన్సిలర్ మిజురు రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.