జూన్ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలు.
జూన్ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలు.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట, మార్చి 04,(రవి కిరణాలు):-
పట్టణంలో కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం, భక్తుల కొంగుబంగారం, దక్షిణ ముఖ ఖాళీ, భక్తుల కొంగుబంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు 2023 సంవత్సరం జూన్ 8 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తెలిపారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 1 తేదీన అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు బ్రహ్మోత్సవాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. సోమవారం ఉదయం ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సూచనల మేరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరు సలహాలు తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. బ్రహ్మోత్సవాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే విధంగా నిర్వహిస్తామని అందుకుగాను అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు.
2023 సంవత్సరం బ్రహ్మోత్సవాలు వివరాలు
1. తేది.26 - 05 - 2023 న తొలి చాటింపు ( మూగచాటు).
2. తేది.02 .06 .2023 న రెండవ చాటింపు.
3. తేది. 04. 06. 2023 న అగండలము వెలిగించుట.
4. తేది. 08.06.2023 న గురువారము బలిహరణ.
5. తేది. 09.06.2023 న శుక్రవారం సుడిమాను ప్రతిష్ట సుళ్ళు ఉత్సవము (అశ్వ వాహనము, గ్రామోత్సవము).
6. తేది. 10.06.2023 న శనివారము సుళ్ళు ఉత్సవము (మహిషాసుర మర్దన, బ్రహ్మోత్సవము).
7. తేది.11.06.2023 న ఆదివారము సుళ్ళు ఉత్సవము (నంది వాహనము, గ్రామోత్సవము).
8. తేది.12.06.2023 న సోమవారము తెప్పోత్సవము (గ్రామోత్సవము).
9. తేది. 13.06.2023 న మంగళవారము శయనసేవ (గ్రామోత్సవము).
10. తేది.14.06.2023 న బుధవారము పుష్ప పల్లకి సేవ.
11. తేది.15.06.2023 న గురువారము సుడిమాను దింపుట.
పై కార్యక్రమముల అన్నింటికీ భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృప కటాక్షం పొందగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ పాలక మండలి సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్, బండి సునీత, మన్నెముద్దుల పద్మజ మరియు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.