శ్రీ  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం నందు స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి 2023 వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం ఐదవ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయగా శ్రీవార్లకు ఉదయం గం.4.00  అభిషేకం,గం.10.30. కి కళ్యాణోత్సవం,మరియు సాయంత్రం గం.5.30. లకు  చెంచులక్షీ, ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కి తిరుచ్ఛి పల్లకి సేవ ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య, గిరిజనుల వాయిద్య నడుమ సహస్రధీపాలంకరణ సేవ(ఊంజల్ సేవ) వైభవంగా నిర్వహించడమైనది భక్తుల ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, మంచి నీరు సరఫరా,అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు  శంకర పురం, వైఎస్సార్ కడప జిల్లా వాస్తవ్యులు కీ శే అనిక నరసయ్య,దేవి గార్ల జ్ఞాపకార్థం  లక్ష్మీ నరసయ్య ,విజయలక్ష్మి గార్లు స్వామివారి శాశ్వత నిత్యాన్నదాన పథకమునకు రాజ పోషకులుగా రూ .1,09,000/-(అక్షరముల ఒక లక్ష తొమ్మిదివేలు రూపాయలు మాత్రమే) విరాళముగా అలయ ప్రధాన అర్చకుల ద్వారా ఆలయ సిబ్బందికి అందజేయడం జరిగినది తెలియజేయడమైనది.

ఇట్లు

చెన్ను తిరుపాల్ రెడ్డి 

ధర్మకర్త మందలి చైర్మన్ 

K. జనార్ధన రెడ్డి

సహయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి