చంద్రునికి చెరువుగా చంద్రయాన్ - 3

ఈ మధ్యాహ్నం కు మూడోవంతు ప్రయాణం పూర్తి .

రేపు సాయంత్రానికి చంద్ర కక్షకు చంద్రయాన్-3 

రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి జులై 14 వ తేదీ ప్రయోగించిన చంద్రయాన్ - 3 

మిషన్ చంద్రుని వైపుకు ప్రయాణిస్తుంది,జులై 31 వ తేదీ అర్ధరాత్రి వరకు చంద్రయాన్ - 3 

మిషన్ భూమి చుట్టూ ఐదు సార్లు తిరగడం పూర్తి చేసుకుంది,అనంతరం తన ప్రయాణాన్ని 

ఆగస్టు 1 వ తేదీ తెల్లవారుజాము నుండి చంద్రుని వైపుకు మళ్లించింది,భూమికి చంద్రునికి 

మధ్య ప్రయాణిస్తున్న చంద్రయాన్ - 3 మిషన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రుని 

వైపు ప్రయాణాన్ని మూడోవంతు పూర్తి చేసింది ,ప్రస్తుతం లూనార్ ఆర్బిట్ లో ప్రయాణం చేస్తున్న చంద్రయాన్ - 3 మిషన్ రేపు సాయంత్రం 7 గంటలకు చంద్రుని కక్ష వద్దకు చేరుకుంటుంది ,అక్కడ నుండి చంద్రుని చుట్టూ తిరిగే పనిని ప్రారంభిస్తుంది,ఇలా చంద్రుని చుట్టూ ఆరు సార్లు తిరిగిన తరువాత, ఈ నెల 17 వ తేదికి చంద్రుని సమీప కక్షలోకి చేరుకుంటుంది, ఆ తరువాత 23 వ తేదీ చంద్రుని పై చంద్రయాన్ - 3 మిషన్ లోని 

ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది.