*ఉపాధ్యాయులు, విద్యారంగం గురించి,   కొన్ని  పత్రికలు  ప్రతిపక్ష పార్టీ యొక్క రాజకీయ లబ్ది కోసం, పూర్తి అసత్య ఆరోపణలు చేయడం  సరికాదని మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..*

========================
 నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు.

▪️ *నాడు నేడు,అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి  ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి, బాటలు వేస్తుందని తెలిపారు.* 

▪️  *ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి అధిక ప్రాదాన్యతను ఇస్తూ తన దృష్టికి తీసుకెళ్లిన టీచర్లకు సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నారని తెలిపారు.*

▪️ *మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్, లీవ్స్ ను 60 రోజుల నుంచి 120 రోజులకి పెంచడం, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లాంగ్వేజ్ పండిట్స్ కు.. స్కూల్ అసిస్టెంట్లు గా ప్రమోషన్లు కల్పించడం, కేజీబీవీ అధ్యాపకులకు  జీతాలు పెంచడం, కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించడం, అలాగే ప్రైవేటు స్కూల్స్ కు సంబంధించిన రెన్యువల్ ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు.. పెంచడం లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తెలిపారు*

▪️ *ప్రభుత్వ విద్యా వ్యవస్థలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అమలు చేయాలని..IFP ప్యానెల్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ ఫర్నిచర్, పిల్లలకు యూనిఫాం, షూస్, బెల్టు, టై,బైజుస్ కంటెంట్, టోఫిల్ శిక్షణ, ఇలా ఎన్నో కార్యక్రమాలతో  పేద విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారని తెలిపారు.*

▪️ *చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న  సమయంలో ఉపాధ్యాయులను ఎలాంటి ఇబ్బందులకు గు రిచేసారో ప్రతి ఒక్కరికి తెలుసని.. అన్నారు.*

▪️ *తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దయనీయమని.. విద్యార్థులు కనీస వసతులు లేక.. పాఠశాలలకు రాలేని దుస్థితి నెలకొందని తెలిపారు.* 

▪️ *అయితే ఈరోజు జరుగుతున్న ఇంతటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని కొన్ని పత్రికలు, విద్యావ్యవస్థ,ఉపాధ్యాయులపై  అసత్య  రాతలు  రాస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తు పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు.*

▪️ *పిల్లల  అభ్యాసన సామర్థ్యం బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదే  అని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఓ పత్రిక పని కట్టుకొని అసత్య వార్తలు  రాయడం  దారుణ మని వ్యాఖ్యానించారు.*

▪️ *ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే.. రికార్డెడ్ గా ఉత్తర్వులు ఇస్తారే తప్ప . మౌఖిక ఆదేశాలు ఉండవని,  ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలాగా  గాలి వార్తలు రాయడం  సమాంజసం కాదని దుయ్యబట్టారు.*

▪️ *జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ,  ఉపాధ్యాయులకు జరుగుతున్న అభివృద్ధి వారికి కనబడటం లేదా అని ప్రశ్నించారు*

▪️  *పత్రికల్లో వస్తున్న అసత్య వార్తలు చూసి ఉపాధ్యాయులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని.. ఉపాధ్యాయులకు ఉన్న ఎలాంటి సమస్యల అయినా  తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వ పెద్దలు లేదా అవసరం అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కి తెలియజేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు..*