చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం.
చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం.
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 07, (రవి కిరణాలు):-
కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు,తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈ చండీయాగం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉభయకర్తలుగా చెన్నైకి చెందిన పెళ్ళూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రసన్నశ్రీ దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.