చల్లా లా గ్రూప్ అధికారుల శ్రీ సిటీ సందర్శన
చల్లా లా గ్రూప్ అధికారుల శ్రీ సిటీ సందర్శన
వెనుకబడిన ప్రాంతంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించినందుకు అభినందన
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) : చల్లా లా గ్రూప్ (వర్జీనియా, USA) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శేఖర్ చల్లా మరియు మేనేజింగ్ అటార్నీ లక్ష్మి చల్లా గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి ఘనస్వాగతం పలికి, శ్రీసిటీ యొక్క ప్రత్యేకతలు మరియు పారిశ్రామిక పురోగతి గురించి వివరించారు.
సందర్శనకు అనుమతించినందుకు రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీసిటీ, అద్భుతమైన మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక పార్కుగా అవతరించిందని శేఖర్ చల్లా కొనియాడారు. దేశంలోనే ప్రముఖ వ్యాపార నగరంగా శ్రీసిటీని అభివృద్ధి చేసినందుకు రవీంద్ర సన్నారెడ్డిని అభినందిస్తూ, త్వరలో ఇది దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. పుష్కలమైన ఉద్యోగ అవకాశాలను సృష్ఠిస్తున్న శ్రీసిటీ మరియు ఇక్కడి పరిశ్రమల కృషిని అభినందిస్తూ, అధిక శాతం స్థానిక ప్రజలకు, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలోని మహిళలకు జీవనోపాధిని కల్పించగలగడం పట్ల లక్ష్మి చల్లా సంతోషం వ్యక్తం చేశారు.
వారి సందర్శన గురించి శ్రీ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానిస్తూ, "వారి రాక మాకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాము. మరియు వారి సలహాలు మరియు సూచనలు మాకు చాలా విలువైనవని అన్నారు.
అతిధులు శ్రీసిటీలోని వివిధ అంశాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తిని కనబరిచారు. వారు ఇండస్ట్రియల్ పార్క్ లో పర్యటించి అక్కడ ముమ్మరంగా సాగుతున్న పనులను వీక్షించారు.
చల్లా లా గ్రూప్ (వర్జీనియా, USA ) చట్టపరమైన వ్యూహాలు మరియు పరిష్కారాలను అందించటంలో సుదీర్ఘ అనుభవమున్న సంస్థ. అమెరికాలోని రిచ్‌మండ్, వర్జీనియా, ఉత్తర కరోలినా మరియు దక్షిణ భారతదేశంలోని కార్యాలయాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్ సంస్థలకు సేవలను అందిస్తారు. ఉద్యోగుల అంతర్జాతీయ బదిలీలు, U.S.లో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు ఉపాధి ఆధారిత వలస సమస్యలు వంటి వివిధ అంశాలపై చల్లా లా గ్రూప్ అటార్నీలు వివిధ కంపెనీలకు సహాయం అందిస్తారు.