శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా.  సూళ్లూరుపేట :- ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్  నివాళులు అర్పించారు. అనంతరం సూళ్లూరుపేట నందు,బజారులోని కచేరి వీధిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, వైస్ చైర్మన్,కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించి ఆయనా సేవలను కొనియాడారు.