అదాని కృష్ణపట్నం పోర్టులో సంబరాలు
అదాని కృష్ణపట్నం పోర్టులో సంబరాలు
ఘనంగాఅదానీ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు
ముత్తుకూరు ఆగస్టు 10 (మేజర్ న్యూస్)
అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ మరియు అదానీ ఫౌండేషన్ 28వ అదానీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పోర్ట్ లో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. యువకులు, మహిళలు, పిల్లలతో సహా 300 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు .ఆదాని కృష్ణపట్నం పోర్టు పరిధిలోని పరిధిలోని 19 మత్స్యకారుల సంఘాలు తోపాటు పోర్ట్ పరిధిలోని 32 గ్రామాల్లో అదానీ ఫౌండేషన్ పనిచేస్తోంది.
అదానీ ఫౌండేషన్ కమ్యూనిటీ ప్రభుత్వ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ప్రభుత్వం పాఠశాలలు, ముత్తుకూరు కృష్ణపట్నం . ఉన్నత పాఠశాలలో
విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, తాగునీరు, గ్రామ పరిశుభ్రత, మహిళా సాధికారత, కమ్యూనిటీ ప్లాంటేషన్ అభివృద్ధిలో కీలకమైన అంశాలు, ఇందులో అదానీ ఫౌండేషన్ CSR ప్రాజెక్టులను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో జీజే రావు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విజనరీ బిజినెస్ లీడర్ గౌతమ్ భాయ్ మరియు అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డా. ప్రీతి జి అదానీ నేతృత్వంలో తాము కృష్ణపట్నం సైట్‌లో భాగస్వామ్య కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను అమలు చేస్తున్నామని అన్నారు. విద్య, ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రత, మహిళా సాధికారత, సహజ వ్యవసాయం, కమ్యూనిటీ ప్లాంటేషన్ మరియు అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ పరిసర గ్రామాలలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాని కృష్ణపట్నం పోర్టు సి ఓ ఓ రాజన్ బాబు ,ఆదాని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్, గణేష్ శర్మ, జి వేణుగోపాల్, ముత్యం జయరామ్ వెంకటేష్ భాస్కరన్ రమేష్ బాబు జె శ్రీనివాసులు సిరియాల సత్యనారాయణ సరళ ఉమా ఫౌండేషన్ ప్రతినిధులు పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.