పల్లెల్లో అభివృద్ధి సంబరాలు
పల్లెల్లో అభివృద్ధి సంబరాలు*
- ఐదేళ్ల పాటు కనీస వసతులకు నోచుకోని పల్లెలకు మహర్దశ.
- పల్లె పండుగ ద్వారా అభివృద్ధి ఫలాలు గ్రామ స్థాయికి..
- అధికారం లోనికి వచ్చిన నాలుగు నెలలకే అభివృద్ధి పర్వం మొదలైంది.
- గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.
- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
విడవలూరు మేజర్ న్యూస్.
ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆనవాళ్లే లేని పల్లెటూళ్లు పల్లె పండుగ కార్యక్రమంతో ప్రగతి పధంలో దూసుకుపోతున్నాయనీ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. విడవలూరు మండలంలోని ఇందిరా నగర్ మరియు వావిళ్ళ గ్రామాలలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లకు శనివారం శంఖుస్థాన చేశారు. ఈ సందర్భంగా జోరు వానను సైతం లెక్క చేయకుండా జనం ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ 82 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. అభివృద్ధి ఫలాలు గ్రామ స్థాయికి చేర్చాలి అన్న ఆశయంతో ప్రభుత్వం పల్లెపండుగ కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరో వైపు గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియి పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాను కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.దశల వారీగా రానున్న ఐదేళ్లలో ప్రతి గ్రామం సమగ్రాభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానన్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఎక్కడైనా రోడ్లు మరియు కాలువలకు గండ్లు పడి ప్రజలు అసౌక్యరానికి గురి కాకుండా రెవెన్యూ, పంచాయతీ రాజ్ మరియు ఇరిగేషన్ అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో అవసరమైతే విపిఆర్ ఫౌండేషన్ కు చెందిన ప్రొక్లైన్ వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. గత ఐదేళ్లుగా మౌలిక సదుపాయాల ఊసే లేని గ్రామాలలో దాదాపు 4500 కోట్ల వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి తొలి దశలో భాగస్వామ్యం దక్కని గ్రామాలను గుర్తించి మలిదశలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ప్రాధాన్యతా క్రమంలో ఒకటి ముందు ఉండొచ్చు మరొకటి తరువాత ఉండొచ్చేమో కానీ
గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఉచిత ఇసుక, సూపర్ సిక్స్, బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ లాంటి ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. దీపావళి నుండి అక్క చెల్లెమ్మలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విడవలూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్, ఎంపీడీవో నగేష్ కుమారి, టీడీపీ మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, రాష్ట కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టిడిపి యువ నాయకులు వంశీ కృష్ణా రెడ్డి, మండల నాయకులు ఆవుల వాసు, టిడిపి మండల ఇంచార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, వావిళ్ళ ఎంపిటిసి హరిరెడ్డి, జనసేన నాయకులు గుడి హరి కుమార్ రెడ్డి, శ్రీనాథ్ యాదవ్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.