నేడు జరిగే పద్మశాలి సమావేశాన్ని జయప్రదం చేయండి

జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ పిలుపు 




నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

అఖిలభారత పద్మశాలి సంఘం సమావేశం నేడు పొదలకూరు మండల కేంద్రంలో జరుగుతుందని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పద్మశాలి కుల బంధువులకు జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ పిలుపునిచ్చారు

శనివారం ఆయన సూర్య మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ పొదలకూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగే పద్మశాలి సమావేశానికి రాష్ట్ర జిల్లా నేతలు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు పై సమావేశానికి మండలం ఇతర ప్రాంతాల నుండి పద్మశాలి కుల బంధువులు కుటుంబాలతో విచ్చేసి సమావేశంలో వారి వారి సమస్యలను రాష్ట్ర నేతలకు వివరించి సమావేశాన్ని కలిసికట్టుగా ఐకమత్యంతో అందరం జయప్రదం చేయాలని ఆయన కోరారు