వైభవంగా పెంచల నరసింహస్వామి జయంతి





 నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నృసింహుని జయంతి సందర్భంగా  బుధవారం రాత్రి శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి తన ఇష్ట వాహనమైన బంగారు గరుడ వాహనం పై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.. నృసింహుని జయంతి సందర్భంగా  పెంచలకోన ఎటు చూసిన కనుచూపుమేర భక్త జనం... ఎవరి నోట విన్నా పెంచలో పెంచలా... గోవిందా.. గోవిందా! అని భక్తకోటి పిలుపులతో పెనుశిల నృసింహుడు పరవశించిపోయాడు. స్వర్ణమయ కాంతులతో మెరిసిపోతున్న గరుత్మంతుడిపై కొలువుదీరి అశేష భక్త జనాన్ని కటాక్షించాడు. తమ ఇలవేల్పు దివ్యస్వరూపాన్ని తిలకించిన భక్తులు ఆనంద డోలికల్లో మునిగితేలారు.నృసిం హ జయంతిని పలు జిల్లాల నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు...