కార్బన్ క్యాప్చర్ యంత్రం. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అభివృద్ధికి ఐఐటి - మద్రాస్ తో ఎస్.ఈ.ఐ.ఎల్. ఎనర్జీ ఒప్పందం. 

పర్యావరణ పరిరక్షణ చర్యల్లో విప్లమాత్మక నిర్ణయాలు. 

పరిశోధన కోసం రూ. 71 లక్షల సి ఎస్ ఆర్ నిధులు కేటాయింపు.  

హర్షం వ్యక్తం చేసిన చుట్టుపక్కల గ్రామా ప్రజలు. 

ముత్తుకూరు, ఫిబ్రవరి 12  ( మేజర్ న్యూస్) ఎస్.ఈ.ఐ.ఎల్. ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ప్రాజెక్ట్ యాజమాన్యం తెలియజేసింది.

 సంచలనాత్మక కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని (బొగ్గు పులుసు వాయువును సంగ్రహించే సాంకేతికత) అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటి) మద్రాస్ తో చేతులు కలిపింది.వినూత్న ప్రాజెక్ట్ కార్బన్ క్యాప్చర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్ ఐఐటి మద్రాస్) కలిగిన ‘’కీమోజెల్’’ అనే నానోపార్టికల్ఆధారిత ద్రావకాన్ని ఇప్పటికే సృష్టించింది. క్షేత్ర స్ధాయిలో ‘’కీమోజెల్’’ పనితీరును పరీక్షించెందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌కు చర్యలు వేగవంతంగా తీసుకోవడం జరిగింది. పరిశోధనకు మద్దతుగా ఎస్ ఈ ఐ ఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో సుమారు రూ. 71 లక్షల నిధులు మంజూరు చేసినట్లు యాజమాన్యం తెలియజేసింది. 

 కంపెనీ సీఈవో రాఘవ్ త్రివేది మాట్లాడారు. ప్రాజెక్ట్‌లో ఐఐటి భాగస్వామ్యం కావడం చాలా అదృష్టమన్నారు. పారిశ్రామిక కార్బన్ క్యాప్చర్ ప్రక్రియలను మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు తెలియజేశారు.

’కీమోజెల్’’ అనేది ఒక అమైనో ఉత్పన్న మైక్రోజెలేటెడ్ ద్రావకంమని  సాంప్రదాయ అమైన్ఆధారిత పరిష్కారాలతో పోలిస్తే ల్యాబ్ పరీక్షలలో మెరుగైన పనితీరును తెలియజేస్తుందని ప్రాజెక్టు సీఈఓ అన్నారు. అధిక కార్బన్ క్యాప్చర్ రేట్లు, అధిక ఆపరేటింగ్ ఉష్ణోగ్రతల వద్ద మెరుగైన పునరుత్పత్తి సామర్థ్యం, మెరుగైన ఎస్ ఓ టు టాలరెన్స్‌తో సాంప్రదాయ అమైన్ఆధారిత డ్రావకాలను అధిగమిస్తుందని తెలిపారు. ఐఐటి మద్రాస్ నకు చెందిన ప్రొఫెసర్ జితేంద్ర సాంగ్వాయి నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ బృందం, అతని రీసెర్చ్ స్కాలర్ యోగేంద్ర కుమార్‌తో కలిసి కార్బన్ క్యాప్చర్ కోసం కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టు యాజమాన్యం తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు . బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ చిమ్నీల నుండి వెలువడే బొగ్గు పులుసు వాయువును సంగ్రహించుట సులభతరం చేయడానికి ప్రొఫెసర్ సాంగ్వై ఒక పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పడం జరిగింది. 

ప్రొఫెసర్ సాంగ్వాయి ప్రకారం పరివర్తనను సాధించడానికి పారిశ్రామిక సమూహాలను డీకార్బనైజ్ చేయడం చాలా కీలకము అనే విషయాన్ని విషయాన్ని తెలియజేశారు. పరిశ్రమఆధారిత కార్బన్ క్యాప్చర్ సీక్వెస్ట్రేషన్ టెక్నాలజీ లేకుండా సాధించడం చాలా కష్టం అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ ద్వారావాస్తవిక పారిశ్రామిక పరిస్థితులలో స్థాపించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ‘’కీమోజెల్’’ సాంకేతికత యొక్క పనితీరును అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సమగ్రంగా యోగేంద్ర కుమారు తెలియజేశారు. 

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పుల కట్టడికి ప్రపంచ ప్రయత్నంలో కీలకమైన, మరింత సమర్థవంతమైన కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలఅభివృద్ధికి ఈ పరిశోధనలో పురోగతి గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.  స్థిరమైన భవిష్యత్తుకు మద్దతుగా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి ప్రాజెక్ట్ యాజమాన్యంతో పాటు ఐఐటి నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తుందన్నారు.