జెఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
షహీన్ బాగ్ చిన్నారి మృతికి సంతాపం
కొవ్వొత్తులు వెలిగించి చిన్నారికి నివాళులర్పిస్తున్న వివిధ పార్టీల నాయకులు
గూడూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : డిల్లీ లోని షహీన్ బాగ్ లో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే దీక్షలలో మంచు తాకిడికి గురై జహాన్ అనే ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన ఈ నెల 3వ తేదీన చోటుచేసుకుంది. దీనికి స్పందించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్వర్ బాష బుధవారం రాత్రి వసీపీఐ, సీపీఎం పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం జేఏసీలతో కలిసి ఆ చిన్నారి మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని షహీన్ బాగ్ లో ముక్కు పచ్చలారని చిన్నారి మృతి విషాదకరమన్నారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. వెంటనే ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు కేశవులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కృష్ణయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ వ్యతిరేక బిల్లులను రద్దు చేసేంత వరకూ ముస్లిం మైనారిటీ లతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. అలాగే కడప జిల్లా జేఏసీ సభ్యులు జాకీర్ మృతికి కూడా సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు తాజుద్దీన్, ఆలిండియా ఇమామ్ కౌన్సిల్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు మౌలానా షఫీ, వైయస్సార్సిపి నాయకులు సయ్యద్, దళిత నాయకులు పల్లి కోటేశ్వరరావు, సీనియర్ మైనారిటీ నాయకులు ఎండీ. ఆన్వర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు మోహన్ దాస్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.