తేది:16-03-2024

స్థలం: నెల్లూరు సిటీ

అభ్యర్థులు గెలుపు కోసం అకుంఠిత దీక్షతో పని చేయండి.

పోలింగ్ కేంధ్రాల వారీగా కింద స్థాయిలో సమాయత్తం కావాలి.. ఎంపీ విజయసాయిరెడ్డి

ఐదు సంవత్సరాల కృషితో అధికారంలోకి వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన మన పార్టీని మరో సారి గెలిపించి, ఏపీలో సంక్షేమ రాజ్యం నిరంతరాయంగా కొనసాగడానికి వచ్చే ఎన్నికలకు మనమందరం అకుంఠిత దీక్షతో పనిచేయాలని వైఎస్ఆర్ సిపి నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు..

వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు, జేసీఎస్‌ మండల ఇంచార్జీలు, జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌ బూత్‌ కమిటీల ఇంచార్జీలలో నెల్లూరు జిల్లా కార్యాలయంలో విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి నుంచి అత్యంత కీలకమైన పోలింగ్‌ బూత్‌ స్థాయి వరకూ ఎన్నికల కార్య క్షేత్రంలో అత్యంత ప్రధాన భూమిక నిర్వహించే మీ అందరితో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు.నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో, అందులోని అన్ని వార్డుల్లో, పట్టణాలు, నగరాలు వాటిలోని వార్డుల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రజలతో సంబంధాలు కొనసాగించాలన్నారు.. ...

నెల్లూరు జిల్లాలో మన పార్టీ విడిచిపెట్టు తెలుగుదేశం పార్టీకి వెళ్లిన వారు వైఎస్అర్ పార్టీకి వెన్నపోటు పోడిచారేనాని మండిపడ్డారు..ప్రతిపక్ష పార్టీలో చేరి కన్నతల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచిన వారికి ప్రజలే  బుద్ధి చెబుతారన్నారు..

జిల్లాకి సాయిరెడ్డి గారి రాక పార్టీకి కొండత అండ- ఎండి ఖలీల్ 

ఒక సామాన్యూడికి ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాసం ఇచ్చిన మా పార్టీ అధినేత జగన్ గారికి నెల్లూరు  సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ అన్నారు.పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని ప్రకటించడంతో నాతో పార్టీ కేడర్ కు కొండత అండ లభించిందన్నారు...నన్ను ఎమ్మెల్యే గా విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్ధిగా గెలిపించాలని ఆయన కోరారు...

ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జెసిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పుత్త శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

అమరజీవి త్యాగనిరతి వెలకట్టలేనిది

నెల్లూరు పార్లమెంటరీ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త

విజయ సాయి రెడ్డి..

అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగం వెలగట్టలేనిదని జిల్లా వైయస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.నగరంలోని మాగుంట లేఔట్ లో గల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ సాయి రెడ్డిపొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ సందర్భంగా

పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు..కార్యక్రమంలో

సిటీ నియోజకవర్గ సమన్వయకర్త ఖలిల్ అహ్మద్జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంగలపూడి శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు....