వైస్ చైర్మన్ ల పదవికి పోటీకి సిద్ధం అభ్యర్థులు ఖరారు.. విప్ జారికి సిద్ధం
వైస్ చైర్మన్ ల పదవికి పోటీకి సిద్ధం అభ్యర్థులు ఖరారు.. విప్ జారికి సిద్ధం
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్:
ఈ నెల 3వతేదీన జరుగు బుచ్చిరెడ్డి పాళెంమునిసిపాలిటీ వైస్ చైర్మన్ల పదవుల పోటీకి సంబంధించి బిఫామ్, నామినేషన్, విప్ జారీ తదితర అంశాలపై మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి,రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కౌన్సిలర్లతోపాటు కలిసి చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయం అని అన్నారు. 3వ తేదీ జరగబోయే ఎన్నిక ప్రజాస్వామ్యానికి మరియు అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుందని భావిస్తున్నాం అని తెలిపారు ఇప్పటికైనా మనసు మార్చుకుని ఏ పార్టీ నుంచి ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని నమ్ముతున్నాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోడీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , బుచ్చి మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి,కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి , మోర్ల భరత్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.