డాక్టర్ జాకీర్ హుస్సేన్ కు నివాళులర్పించిన సిపిఎం నాయకులు
డాక్టర్ జాకీర్ హుస్సేన్ కు నివాళులర్పించిన సిపిఎం నాయకులు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ 138 వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం నెల్లూరు సిటీ 53వ డివిజన్ వెంకటేశ్వరపురం సెంటర్లో గల డాక్టర్ జాకీర్ హుస్సేన్ విగ్రహానికి పూలమాలలు వేసి సిపిఎం నాయకులు నివాళులు అర్పించారు.కుల మత,ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్రం కోసం భారత ప్రజలు ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకుని భారత రాజ్యాంగాన్ని నిర్మించారు అని,మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి అని వాటిని భారత ప్రజల ఐక్యంగా తిప్పి కొట్టాలి అని సిపిఎం నాయకులు తెలిపారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ కు నివాళులు అర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు.సిపిఎం స్థానిక నాయకులు, కార్యకర్తలు వున్నారు.