పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు.రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్‌ ప్లాన్‌) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టుల బాట పట్టారు.