థామస్ కప్ విజేత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ను అభినందించిన సీఎం శ్రీ జగన్ మెహన్ రెడ్డి
థామస్ కప్ విజేత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ను అభినందించిన సీఎం శ్రీ జగన్ మెహన్ రెడ్డి
ఇటీవల జరిగిన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన థామస్ కప్ బాడ్మింటన్ విజేత అయిన భారత బాడ్మింటన్ జట్టు కెప్టెన్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భముగా రాష్ట్రములో బాడ్మింటన్ క్రీడ విస్తరణ, క్రీడాకారుల అభివృద్ధి కొరకు తీసుకుంటున్న చర్యలు గూర్చి ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు దీనికి సానుకూలంగా స్పందించి బాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కృషిచేస్తామని తెలిపారు. థామస్ కప్ విజేత టీమ్ కెప్టెన్ కిదాంబి శ్రీకాంత్ ను మరియు ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమములో క్రీడాశాఖ మంత్రి శ్రీమతి RK రోజా, శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.