నేడు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం సిపిఎం, సిఐటియు
నేడు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం సిపిఎం, సిఐటియు .
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చింది. కాని అవేమి నెరవేర్చలేదని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ఫెడరేషన్ (1.8.2023) మంగళవారం రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల గౌ అధ్యక్షులు కె సాంబశివయ్య మాట్లాడుతూ కనీస వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పాత పెన్షను పద్దతి పునరుద్ధరించాలని దళారి వ్యవస్థను తొలగించాలన్నారు. భ.ని.కా జిల్లా అధ్యక్షులు కా ఏ అల్లెయ్య మాట్లాడుతూ 1.5.2023 కార్మికులందరు మున్సిపల్ ఆఫీసు ముట్టడిలో పాల్గొంటున్నానరన్నారు. తదుపరి రాష్ట్ర కమిటి డిమాండ్ల నోటీసును మునిసిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ కు అందజేసారు. కార్యక్రమములో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కా. డి.రమణయ్య, కా. లక్ష్మయ్య, ఎస్ కె రియాజ్ మున్సిపల్ కార్మిక నాయకులు రామయ్య, ఫళణి వెంకటరత్నం శ్రీదేవి సిఐటియు నాయకులు రాజబాబు విజయ తదితర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.