షార్ లో ఘనంగా సి.ఐ.ఎస్ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం.
షార్ లో ఘనంగా సి.ఐ.ఎస్ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం.
శ్రీహరికోట సూళ్లూరుపేట మార్చి 10 (రవి కిరణాలు):-
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (రాకెట్ ప్రయోగ కేంద్రం) షార్ సెంటర్ లో శుక్రవారం సి. ఐ.ఎస్.ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భముగా సి ఐ ఎస్ ఎఫ్ బలగాలు మార్చిఫాస్ట్
చేసి రకరకాల విన్యాసాలు ప్రదర్శించడం తో పాటు డాన్సులతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో సి ఐ ఎస్ ఎఫ్ కమాండెంట్ రేఖ నంబియార్,డిప్యూటీ కమాండెంట్
నిరేష్ కుమార్ గౌర్ తో పాటు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.