కొండాపురం లో దారుణ హత్య

తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామంలోని వడ్డి పాలెంలో విషాదం చోటుచేసుకుంది.
మంగళవారం తెల్లవారుజామున
భార్య దనమ్మ(55)ను కిరాతకంగా హత్య చేసి భర్త రమణయ్య పరారీలో ఉన్నట్లు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.
15 సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న ధనమ్మ,రమణయ్య లు 2 నెలల క్రితం మళ్ళీ కలిసి ఒకటిగా ఉంటూ నెల క్రితం మళ్ళీ గొడవలు పడి విడిగా జీవిస్తున్నారు.దనమ్మ,రమణయ్య కు ముగ్గురు పిల్లలు,అదే గ్రామం లో  ఒక కొడుకు తో కలిసి జీవిస్తున్న దనమ్మ ను రమణయ్య ఈ రోజు తెల్లవారు జామున ఇనుప రాడ్డు తో తల పగలగొట్టి అతి కిరతంగా చంపినట్టు సమాచారం..పరారీలో నిందితుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వాకాడు మండలం లోని ని బాలిరెడ్డి పాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.