వారిద్దరు చెప్పిందే జరుగుతోంది.. మాజీ మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు, జనవరి 04, (రవికిరణాలు) : శనివారం నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ జీఎన్ రావు, బీసీజీ ఏ కమిటీ అయినప్పటికీ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే నివేదికల్లో కనిపిస్తోందని వైజాగ్ లో విజయసాయి రెడ్డి ఏమని ప్రకటించారో దానినే నివేదికల్లో రాస్తున్నారన్నారు. వారిద్దరు చెప్పిందే జరుగుతోందని
బీసీజీ వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చిందన్నారు. జీఎన్ రావు కమిటీ రిపోర్టును జెరాక్స్ తీసిచ్చినట్టుందని ఐదు కోట్ల ప్రజల మనోభావాలతో చాలా చులకనగాఆడుకుంటున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని 151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు పాలన అందించడం మానేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ వాతావరణం తెచ్చారని జీఎన్ రావు కమిటీ గవర్నర్ నివాసం అమరావతిలో అని చెప్పింది. బీసీజీ రిపోర్టు మాత్రం వైజాగ్ కు మార్చినట్టుంది..
మంత్రుల నివాసాలు అమరావతిలో అని జీఎన్ రావు కమిటీ చెప్పగా బీసీజీ అసలేం చెప్పలేదు..మంత్రులు గాలిలో ఉంటారా..ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలెనుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదించి, రాజధానికి నిధులు విడుదల చేసి, దేశ చిత్రపటంలో రాజధానిగా అమరావతిని గుర్తించి ఈ రోజు మారస్తామంటే ఆషామాషి కాదు అది మీ వల్ల కాదు.మీ ఐదేళ్ల పాలన కాలంలో హైకోర్టు మూడు బెంచీలకు సుప్రీకోర్టు అనుమతులు వచ్చేది కష్టమే..హైకోర్టు మార్చడం అంత తేలికకాదు..సాక్ష్యాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి,
నిధులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదు ప్రజల హక్కులను కాపాడేందుకు న్యాయ స్థానాలున్నాయి..ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలను ఆపండి..చంద్రబాబు నాయుడిపై కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేయకండి..ప్రశాంతంగా ఆలోచించండి రైతులను బాధపెడుతుండటం దురదృష్టకరం..ఇది మీ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు..
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను ఆర్నెళ్లలో అధోగతి పట్టించారని ఈ సందర్బంగా సోమిరెడ్డి పేర్కొన్నారు.