పుస్తకాలు మన కుటుంబ సభ్యులు పుస్తక మిత్ర గ్రంథాలయం ప్రారంభం
పుస్తకాలు మన కుటుంబ సభ్యులు పుస్తక మిత్ర గ్రంథాలయం ప్రారంభం
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్: ఇంట్లో కుటుంబ సభ్యులతో బంధం ఉన్నట్లే, పుస్తకాలతో అనుబంధం పెంచుకుంటే విద్యార్థి దశ నుండే జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందని బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.శ్రీహరి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పెద్దూరు బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుస్తక మిత్ర గ్రంధాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలు చదవడం వలన మహనీయుల జీవిత చరిత్రతో స్ఫూర్తి పొంది ఉన్నత స్థానానికి చేరుకుంటా రన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఎస్వీ నాయక్, పీవీరత్నం మాట్లాడుతూ నిరంతరం విద్యార్థులు పుస్తక పఠనం చేయడం వలన విజ్ఞానము, వికాసము, విచక్షణ,వ్యక్తిత్వ వికాసం,నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయన్నారు. నిస్వార్థంగా పిల్లల కోసం పుస్తకాలు అందజేస్తూ సేవలందిస్తున్న ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల చేత ప్రతిరోజు ఒక గంట పాటు పుస్తకాలు చదువుతామని ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయు రాలు ఎం.సుజాత, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.