నెల్లూరు నగరంలోని కుక్కలగుంట ప్రాంతంలో "స్పందించే హృదయాలు" సంస్థ వారు నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ ప్రారంభించి, రక్త దాతలకు మొమెంటోలను అందజేశారు. రెడ్ క్రాస్ సంస్థ వారు సేకరించిన ఈ శిబిరంలో 256 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పందించే హృదయాలు సంస్థ సభ్యులు తాళ్ళపాక హనుమాచారి, ఎన్.మస్తాన్, శరత్ బాబు, శ్రీహరి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు శివపురం సురేష్, శివకుమార్ ఆచారి, చెంగయ్య ఆచారి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, రామకృష్ణాచారి, చంద్ర, రమేష్, శైలేంద్ర, శేఖర్, శివాని, సుభాని, సుధీర్, విజయ్, కుమార్, మురుగేష్ ఆచారి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.