సూళ్లూరుపేట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా నా బిడ్డ డాక్టర్ నెలవల జయశ్రీని ఆశీర్వదించండి:- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం.
సూళ్లూరుపేట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా నా బిడ్డ డాక్టర్ నెలవల జయశ్రీని ఆశీర్వదించండి:- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం,జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి, డా "నెలవల విజయశ్రీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదివారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపము నందు నియోజకవర్గ కార్యకర్తలకు అభిమానులకు పత్రిక విలేకరులకు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సుళ్ళూరుపేట నియోజకవర్గానికి డా "నెలవల విజయశ్రీ ని ప్రకటించిన విషయం తెలిసిందే నని ఇక అప్పటినుంచి ఆమె నిత్యం ప్రజల్లో ఉంటూ ఆ పార్టీ నాయకులను కలుస్తూ రానున్న ఎన్నికల్లో తన విజయానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలుస్తూ కోరుకుంటుందనీ అన్నారు .ఇందులో భాగంగా ఆదివారం జనసేన మరియు తెలుగుదేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాగే ఆమె పరిచయ కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీ సుళ్ళూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి.. ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం సూళ్లూరుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయుడుపేట సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, పెళ్లకూరు, ఓజిలి, మండలాల కార్యకర్తలు, నాయకులు,అభిమానులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా నిలబెట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని అన్నారు. అలాగే
సుళ్ళూరుపేట నియోజకవర్గంలో డా "
నెలవల విజయశ్రీని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్టుగా అందించాలని అన్నారు. అంతేకాకుండా సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాయర్ సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాళ్, మాధవ నాయుడు అలవల సురేష్, జనసేన అభ్యర్థి ఉయ్యాల ప్రవీణ్ కుమార్, వెంకటస్వామి, రాజేష్ ఆరు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించారు.