తెలుగుదేశం పార్టీని ఆదరించండి.

డా " నెలవల విజయశ్రీ ని ఆశీర్వదించి, గెలిపించండి :- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం.

 రవి కిరణాలు తిరుపతి జిల్లా నాయుడుపేట:-

 



 సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి  డాక్టర్ నలవల విజయశ్రీ ని ఆశీర్వదించి గెలిపించాలని మాజీ ఎంపీ,సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. సోమవారం ఆయన ఉమ్మడి అభ్యర్థి డా " నెలవల విజయశ్రీ తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి  నాయుడుపేట పట్టణంలోని నవోదయ,విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి కరస్పాండెంట్లను, ఉపాధ్యాయులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల   ఉపాధ్యాయులకు  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు  ప్రవేశ పెట్టబోతున్న సూపర్ సిక్స్  పథకాలను వివరించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయ్ శ్రీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి నానాబాల సుబ్బారావు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బిరదవాడ నారాయణ,తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు అవధానం సుధీర్, దాసరి సాధికారిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఇమిడి సెట్టి వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, 49వ బూత్ కన్వీనర్ వాకిలి వెంకటేశ్వర్లు,పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రెహమాన్, పార్లమెంట్ కార్యదర్శి మొండెం బాబు,జువ్వలపాలెం రవి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.