సూళ్లూరుపేట లో ఘనంగా నెలవల రాజేష్ జన్మదిన వేడుకలు.

 జన్మ దినం పురస్కరించుకొని 

సూళ్లూరుపేట లో రక్తదాన శిబిరం





రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోదరుడు  తెలుగుదేశం పార్టీ నాయకుడు నెలవల రాజేష్ 

పుట్టిన రోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం ను తెలుగుదేశం పార్టీ నేతల అద్వర్యం లో నిర్వహించారు,ముందుగా 

ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయం లో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్,కార్యదర్శి ఏజీ కిషోర్ అద్వర్యం లో 

జరిగిన కార్యక్రమం లో ముందుగా ఎమ్మేల్యే  నెలవల విజయశ్రీ ఆమె భర్త పార్థసారధి తో కలిసి సోదరునికి పుష్పగుచ్ఛము అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు,అనంతరం నెలవల రాజేష్ చేత కేకు కట్ చేయించి ఆయనకు తినిపించారు, ఈ సందర్భముగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రాజేష్ ను సన్మానించి సత్కరించారు,అనంతరం 

రాజేష్ జన్మదినం సందర్భముగా స్థానిక  షార్ రోడ్ లోని నందా ఫక్షన్ హాల్ జరిగిన రక్తదాన శిబిరం ను ప్రారంభించారు.

అక్కడ ముందుగా రాజేష్ చేతులు మీదుగా బారి కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టారు, ఇక్కడ కూడా ఎమ్మేల్యే నెలవల విజయశ్రీ సమక్షం లో టీడీపీ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజేష్ ను సన్మానించి సత్కరించారు,ఇది ఇలా ఉంటె 

పట్టణ తెలుగుదేశం పార్టీ అదేక్షుడు ఆకుతోట రమేష్ వర్గీయులు మాత్రం ముందుగా వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 

నెలవల రాజేష్ కు శాలువాలు కప్పకుండా దానికి బదులుగా నోట్ బుక్స్ ను అందించారు,వాటిని ఎమ్మేల్యే చేతులు మీదుగా పేద విద్యార్థులకు పంపిణి చేశారు , ఈ కార్యక్రమం లో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు పచ్చవ మాధవ్ నాయుడు,కుదిరి పెంచలయ్య ,ఆలీ తదితరులు పాల్గొన్నారు.

నెలవల రాజేష్ తో పాటు ఆయన కుమారుడు జయదేవ్ పుట్టిన రోజుకూడా ఈ రోజే కావడం తో స్థానిక గణపతి నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  జయదేవ్ చేతులు మీదుగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీచేయడం జరిగింది .