ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తడ ,సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండల శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు కొరకు బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు హోలీ క్రాస్ జంక్షన్ నుండి  యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ కావూరు ప్రభాకర్ గారి అధ్యక్షతన సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది .ఈ కార్యక్రమం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ జి జే రాజశేఖర్ గారు యుటిఎఫ్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న సి పీ ఎస్ విధానాన్ని ఇంతవరకు రద్దు చేయకపోవడాన్ని, ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. యు టి ఎఫ్ సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తూ- కలిసివచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని కలిపి జేఏసీ ఏర్పాటు చేసి, సిపిఎస్ నిర్వీర్యం చేసేంతవరకు పోరాడతామని తెలియజేశారు. మార్చి 31వ తేదీ లోపు సిపిఎస్ రద్దు కొరకు ప్రభుత్వం రోడ్డు మ్యాప్ వేస్తుందని తెలిపింది. అయినా ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతులు హై స్కూల్ లో విలీనం చేయడం వల్ల ప్రాథమిక విద్య కుంటు పడుతుందని, బడుగు బలహీన పేద కుటుంబాలకు ప్రాథమిక విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలియజేసి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత మూడు మండలాల ప్రధాన బాధ్యులు ప్రాంతీయ మహిళా కమిటీ కన్వీనర్ శ్రీమతి కే ఎన్ ఎస్ సునీల గారు సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాలను వివరించారు . సూళ్లూరుపేట గౌరవ అధ్యక్షులు పి వెంకట స్వామి గారు తడ ప్రధాన కార్యదర్శి ఎస్ బాబు గారు దొరవారి సత్రం అధ్యక్షులు ఎం రమేష్ గారు సిపిఎస్ ఎస్ రద్దు కోరుతూ దాని వల్ల జరిగే నష్టాలు పరిణామాలను వివరించారు. తర్వాత జిల్లా నాయకులు మూడు మండల ప్రధాన బాధ్యులు మహిళా కమిటీ నాయకులు సి పి ఎస్ రద్దు కోరుతూ వినతి పత్రాన్ని ఎమ్మార్వో గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ,పెన్షనర్స్ 70 మంది వరకు పాల్గొని విజయవంతం చేశారు .ఈ కార్యక్రమంలో 3 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓంకారం శ్రీనివాసులు, కే సుధాకర్, ఎం శ్రీనివాసులు ,సిహెచ్ జనార్ధన్ బొబ్బిలి చంద్రశేఖర్,  ఎస్కే హుస్సేన్ భాష ,డి సుబ్రహ్మణ్యం ,గోవర్ధన్, ఎస్ మస్తాన్ ఏదైనా మాహిళా కమిటీ నాయకులు సిహెచ్ రాజేశ్వరి ,సిహెచ్ జి ఉషారాణి, విజయవాణి భాగ్యమ్మ ,కుమారి కిరణ్, జానకి, కుసుమ కుమారి నిర్మల, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య ,రాజేష్ రామ్మూర్తి గారు పాల్గొన్నారు.