అమ్మ ఒడి పథకం లబ్దిదారులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. ఈ పథకంపై మరోసారి కోతలు పెట్టాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయం

అమ్మ ఒడి పథకం లబ్దిదారులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. ఈ పథకంపై మరోసారి కోతలు పెట్టాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలల్లో ఇప్పటికే రూ.1000 కోత పెట్టిన జగన్‌ సర్కార్‌..ఇప్పుడు మరో రూ. 1000 కట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మొత్తంగా రూ.2000 లబ్ది దారులకు కోత పడనుంది.ఇక ఇప్పటికే మరుగు దొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ. 1000 మినహాయించేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సిద్ధమౌవుతోంది. ఈ పథకం కింద జూన్‌ లో రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ది దారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ ద్వారా పాఠశాలల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధిదకారులు ఇప్పటికే.. జిల్లా స్థాయి అధికారులకు చేరవేశారు. ఈ నెల నుంచే ఇది అమలు అయ్యే ఛాన్స ఉన్నట్లు సమాచారం.