మార్చి 15 తేదిన రాజధాని ముట్టడిని జయప్రదం చేయండి:- ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ
మార్చి 15 తేదిన రాజధాని ముట్టడిని జయప్రదం చేయండి:- ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట, ఫిబ్రవరి 26 (రవి కిరణాలు):-
ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చట్టబద్ధత భాగంగా ఆదివారం రెండో విడత మాదిగల సంగ్రామ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్చార్జి గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ దేవస్థానం నుండి ప్రారంభించారు. ఈ పాదయాత్ర ను గురుమూర్తి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్చార్జి గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని అన్నారు. ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ,బి,సి,డి గా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ యొక్క హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని అందువలన ఈ పాదయాత్ర సూళ్లూరుపేట నుండి ఆంధ్ర రాష్ట్ర రాజధాని వరకు కొనసాగిస్తామని మార్చి 15వ తేదీ న రాజధానిని ముట్టడి చేస్తామని అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందు వాసు మాదిగ ,లేబాకు మురళి మాదిగ, మంద పెంచలయ్య మాదిగ ,కయ్యారపు మురళి మాదిగ,తాళ్లూరు శేషయ్య మాదిగ, కంటేపల్లి నాగేశ్వరావు మాదిగ, కుక్క మల్లి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.