సేవియర్స్ ఆధ్వర్యంలో లో బీచ్- క్లీనప్- డే


కావలి కి చెందిన సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్  ఆధ్వర్యంలో ఈ ఆదివారం బీచ్ క్లీనప్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సేవియర్స్ సభ్యులు మాట్లాడుతూ తరచుగా అధిక సంఖ్యలో పర్యాటకులు తుమ్మలపెంట బీచ్ కు వస్తూ ఉంటారు. వారు వాడిన వివిధ ప్లాస్టిక్ వ్యర్థాలను అక్కడ విడిచి వెళ్లడం కారణంగా అధిక సంఖ్యలో పొల్యూషన్ ఏర్పడుతుందని దీనివలన ఇతర పర్యాటకులు కూడా ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో ఈరోజు సభ్యులు అందరం కలిసి అక్కడ అ పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అన్ని వేరి పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ లో వేసి. .అలానే అక్కడ ఉన్న పర్యాటకులకు ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయరాదని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రణీత్ ,వినీల్, ధీరజ్ ,కీర్తి, దీపిక, నవ్య ,తపస్వి ,శ్రేయ, గాయత్రి, నాగేంద్ర ,పవన్ సాయి, సుజిత్, ప్రవీణ్ పవన్ మణికంఠ తరుణ్ రోహిత్ ,భార్గవ్ ,సంతోష్ ,మౌర్య శాలెం, మనిష్ ,వరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.