ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ 393 వ జన్మదినం సందర్భంగా బారీ ర్యాలీ

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట :-

 సూళ్లూరుపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ 393 వ జన్మదినాన్ని పురస్కరించుకుని బజారు పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్య్రమంలో తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం   విద్యార్థులుకు మన దేశానికి శివాజీ మహారాజ్ సాధించిన ఘనతను తెలుపుతూ ప్రతి విద్యార్ధి దేశ భక్తి భావంతో మెలగాలని వివరించారు. ఈ కార్యక్రమానికి వేనాటి దేవేందర్ రెడ్డి, మిట్ట రూపేష్, హేమ శేఖర్ కృష్ణారెడ్డి,  ఏబివిపి సన్నీ, మరియు హరి, విస్తారక్, తదితరులు పాల్గొన్నారు.