మర్రిపాడు, జనవరి 8, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో సిపిఎం, సీఐటీయూ పార్టీల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. బందులో భాగంగా దుకాణాలను స్వచ్ఛందంగా మూయించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వెంకయ్య మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. పౌరసత్వం సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను అమలు చేయాలని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీల నేతలు మహమ్మద్ గౌస్, రహమతుల్లా, రత్తయ్య, రామయ్య, సుధాకర్, మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.