జనసేన కోట మండల అధ్యక్షుడు గా బాల సుబ్రహ్మణ్యం
కోట మండల జనసేన పార్టీ అధ్యక్షులు గా కోట గ్రామానికి చెందిన దామవరపు బాల సుబ్రహ్మణ్యం నియమిస్తూ బుధవారం జన సేన పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేశారు. బాల సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దింతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన మండల అధ్యక్షులు ఎంపిక నేపథ్యంలో కోట మండల జనసేన అధ్యక్షుడు గా బాల సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం తనపై ఉన్న నమ్మకం ఉంచి కోట మండల అధ్యక్ష పదవి ఇవ్వడం తనపై మరింత బాధ్యత పెరిగింది అని తెలిపారు. జనసేన ఒక్క గొప్ప పార్టీ అని సామాన్యులకు సైతం సముచిత స్థానం కల్పించడం గొప్ప విషయం అన్నారు.దళిత కులానికి చెందిన తనకు మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కి జీవితాంతం ఋణపడి ఉంటానన్నారు.
జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి చేస్తూ, 2024 లో రాష్ట్ర ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ను చూడాలి అనే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు, ముఖ్యమంత్రి యువతలో చైతన్యం తీసుకొని వచ్చి జన సేన పార్టీని బలోపేతం చేసి ప్రజా పక్షం పోరాటాలు చేస్తాను ని చెప్పారు.
తన సేవలు గుర్తించి తనకు అన్ని వేళల్లో అండగా ఉన్న జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, జిల్లా ప్రధానకార్యదర్శి గునుకుల కిషోర్ లకు ఈ సందర్బంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా తనకు అన్ని విధాలా జన సేన నేత అల్లం బాబు కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐక్యమత్యంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం పలువురు బాల సుబ్రహ్మణ్యం కు అభినందలు తెలియజేశారు.