కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి.  



జగనన్న పాలనలో బడి బహుదూరం.

నూతన విద్యావిధానం వలన జిల్లాలోనే ఎక్కువ స్ట్రేంత్ ఉన్న గుమ్మళ్ల దిబ్బ ప్రాథమికోన్నత పాఠశాలకూడా మూతపడనున్నది. కోవూరు పట్టణంలో  11 పాఠశాలలు మూతపడనున్నాయి.

చంద్రబాబు గారు కిలోమీటరు కు ఒక పాఠశాల పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాఠశాలలు మూసివేస్తున్నారు.

మండలంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడవలసిన బాధ్యత ప్రసన్నకుమార్ రెడ్డిదే.

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వలన విద్యార్థులకు బడి బహుదూరం అవుతుంది. ఇప్పటి వరకూ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసి వేసి వాటిలో చదువుతున్న విద్యార్థులను 1,2 తరగతి వారిని అంగన్వాడీ కేంద్రాలలో 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులను హైస్కూలలో విలీనం చేయనున్నారు. 3వ వ తరగతి విద్యార్థి అంటే 8 సంవత్సరాల వయస్సు కూడా ఉండదు.ఆ వయస్సులో రెండు,మూడు కిలోమీటర్ల నడిచి పాఠశాలకు వెళ్లాలంటే ఆచరణ సాధ్యం కాదు. దీనివలన పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉంది. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ల దిబ్బలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో దాదాపు 419 మంది విద్యార్థులు చదువుతున్నారు.జిల్లాలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో కల్లా అత్యధిక మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ ఇది ఒకటి. అటువంటి స్కూల్ కూడా ఈ విధానం వలన మూత పడనున్నది. నూతన విధానము వలన ఈ పాఠశాలను మూసి వేసి పాటురు హైస్కూలు లో విలీనం చేస్తున్నారు. దీని వలన ఇక్కడ చదివే 3,4,5,6,7 తరగతులు విద్యార్థులు పాటురుకు వేళ్ళ వలసి వస్తుంది.
కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీ లోని పాఠశాలతో సహా 11 పాఠశాలలు మూత పడనున్నాయి.పడుగుపాడు,గంగవరం,జమ్మిపాలెం, మోడిగుంట,పోతిరెడ్డిపాలెం, చెర్లోపాలెం లో ఉన్న పాఠశాలలు మూత పడనున్నాయి.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో గ్రామాల్లో ప్రతి దళిత వాడ, గిరిజన వాడలతో పాటు ఆ గ్రామములో ఎన్ని కాలనీలు ఉంటే అన్ని కాలనిలలో పాఠశాలలు ఏర్పాటు చేస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాఠశాలలు మూసివేస్తున్నారు. ఈ విధానం వలన కోవూరు మండలంలో దాదాపు 60 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే నేడు 10 పాఠశాలలు మాత్రమే ఉండబోతున్నాయి 50 పాఠశాలలు మూత పడనున్నాయి. కొన్ని గ్రామాల్లో ఒక్క పాఠశాల కూడా ఉండదు. కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరని చెపుతుంటారు.నిజంగా ఈ విధంగా పాఠాశాలలు మూసివేసిన ముఖ్యమంత్రి దేశంలోనే లేరు.స్థానిక శాసనసభ్యుడుగా కోవూరు మండలం లో ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడవలసిన బాధ్యత ప్రసన్నకుమార్ రెడ్డి గారి పై ఉంది. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవికుమార్,కలికి సత్యనారాయణ రెడ్డి,జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి, ఇంటూరు విజయ్,ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,SK నాసీర్,మహ్మద్, బుధవరపు శివకుమార్, కె గోపాల్,వల్లెపు సురేష్,చల్లా సూర్య,బెల్లంకొండ మల్లికార్జున,అఖిల్,నవీన్,షరీఫ్,బద్దెపూడి వెంకట రమణ,ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.