నల్లపరెడ్డి రాజేంద్రకుమార్ రెడ్డి,రాహిన్ రెడ్డిల పై సర్పంచ్ ధ్వజం  నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  ఆశీస్సులతో... నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కృషి తో సర్పంచ్ గా గెలిచాను  రాజేంద్రకుమార్ రెడ్డి,రాహిన్ రెడ్డి లు ఇబ్బందులు పెడుతున్నారు: సర్పంచ్

 వారు పిలిస్తే నేను ఎక్కడికి రాను   వినోద్ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తా: సర్పంచ్  సర్పంచ్ బాటలో వార్డు మెంబర్లు కూడా..  వార్డు మెంబర్లు తో కలిసి కోటను అభివృద్ధి చేస్తా..  టీడీపీకి మద్దతు గా రాజేంద్రకుమార్ రెడ్డి,రాహిన్ రెడ్డి లు నిలవడం బాధాకరం  సర్పంచ్ కి తెలియకుండా పనులు చేయడం ఏమిటి- సర్పంచ్ ధ్వజం?  కోట గ్రామ ప్రజలు, వినోద్ రెడ్డి ఆశీస్సులతో పనిచేస్తా.. కోట సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ వెల్లడి

 కోట గ్రామ పంచాయితీ లో రోజు రోజుకు రాజకీయాలువేడిక్కుతున్నాయి. నల్లపరెడ్ల కుటుంబంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒక్కరిపై ఒక్కరూ విమర్శలు చేసుకోవడంతో వర్గపోరుగా మారడంతో ఇటు నల్లపరెడ్డి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరితో పాటుగా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ఇలాంటి పరిస్థితుల్లో కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ, కోట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు బహిరంగంగా రోడ్డు ఎక్కి నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, రాహిన్ రెడ్డి ల నాయకత్వంలో పనిచేయలేము అంటూ గంట పథంగా చెప్పడం గమనార్హం. 70 ఏళ్ల గ్రామ పంచాయతీ లో ఒక గిరిజన మహిళ సర్పంచ్ ఏకంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులైన రాజేంద్ర కుమార్ రెడ్డి, రాహిన్ రెడ్డిల పై ధ్వజమెత్తడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు  రాజేంద్రకుమార్ రెడ్డి,రాహిన్ రెడ్డిల నాయకత్వం లో పనిచేయము అని తమకు రాజకీయ భిక్ష పెట్టింది నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లు వారి కృషి ఆశీస్సులతో గెలిచాను అనీ, అందువలన వారి నాయకత్వం లో పనిచేస్తా తనను ఇబ్బందులు పెట్టడం వారికి భావ్యం కాదు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ఈ సందర్భంగా మంగళవారం కోటలో సర్పంచ్, వార్డు మెంబర్లు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, రాహిన్ రెడ్డి లు తనను వారితో తీరగమని ఇబ్బందులు పెడుతున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట గ్రామ పంచాయితీ లో తనకు తెలియకుండా అధికారులు పనులు చేస్తే వాటిని తాను ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యులు వచ్చి తనతో గొడవ పడ్డారు వారికి మద్దతుగారాజేంద్ర కుమార్ రెడ్డి, రాహిన్ రెడ్డి లు నిలవడం బాధాకరంగా ఉంది అన్నారు.ఇంకా పై మరోసారి తనను పిలిస్తే  బాగుండదు అని,తాను నల్లపరెడ్డి వినోద్ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తాను అని ఆమె గట్టిగా చెప్పారు.

 బిట్ 2 ఎంపీటీసీ ఎన్నికల్లో బిట్2 వైసీపీ అభ్యర్థి షేక్ మొబిన్ బాషా గెలిస్తే వైసీపీ నేత రాజేంద్ర కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి నైతికంగా గెలిచారు అని చెప్పడం,మొన్న టీడీపీ వార్డు మెంబర్ల కు మద్దతుగా నిలవడం చాలా బాధాకరం గా ఉంది అని సర్పంచ్ ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా సర్పంచ్ బాటలో వార్డు మెంబర్లు కూడా వినోద్ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తామని, ఎవరూ వచ్చిన ఏమి చెప్పిన వినే ప్రసక్తే లేదు అన్నారు.సర్పంచ్ తో పాటు 2,13,15, వార్డు మెంబర్లు దాసరి కృష్ణమ్మ, అరీఫ్, కాళగంధ విజయమ్మ, వైసీపీ నేత రాయపు పొలయ్య తదితరులు ఉన్నారు.