వెడిచర్ల, డిసెంబర్ 29,(రవికిరణాలు) : ఆదివారం వెడిచర్ల గ్రామంలో ఎరువులు వినియోగం, సస్యరక్షణ చర్యలు పైన అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కె.శివ మాట్లాడుతూ వరిలో రైతులు పై పాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించాలని లేని యెడల నత్రజని శాతం అధికమై పంట అగ్గితెగులు,పాముపొడ, బాక్టీరియా ఎండు  తెగుళ్లకు అలాగే తెల్ల తెగులు, దోమ వంటి  పురుగులకు నిలయమవుతుందని తద్వారా రైతుకు సాగు ఖర్చు పెరగడమే కాకుండా పండించే పంట కూడా  విషతుల్యం అవుతుందని, కాబట్టి రైతులందరూ భూసార పరీక్ష విశ్లేషణ పత్రాల ఆధారంగా ఎరువులు వాడాలని ఆయన  సూచించారు.అనంతరం రైతులకు వరిలో ఆయా దశలలో వాడవలసిన ఎరువుల, పురుగుమందుల మోతాదులు, అలాగే పురుగు మందులు స్ప్రే చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన చార్టులు ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు బాబు రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు..