ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం
ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం
వరికుంటపాడు మేజర్ న్యూస్
ఇంకుడు గుంతల పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నేతృత్వంలో ఇంకుడు గుంతలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంకుడు గుంతలు తొవ్వుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెంచుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతే కాకుండా మరుగు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించడం ద్వారా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మురుగునీరు దుర్వాసన, దోమలు వంటివి ప్రలోభక్కుండా కాపాడుతుందని తద్వారా మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలియజేశారు.ప్రభుత్వం ఇంకుడు గుంతలకు సుమారు ఐదువేల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇంకుడు గుంతలు ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి అందడమే కాకుండా ఇంటి నీటిని ఒడిసిపెట్టి తద్వారా భూగర్భ జలాలని పెంచుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. మంజూరైనటువంటి ప్రతి లబ్ధిదారులు ఇంకుడు గుంతలు సద్వినియోగం చేసుకొని ఉత్తమ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మల్లంపాటి కొండప నాయుడు తెదేపా గ్రామ ఎస్టీ సెల్ నాయకులు అల్లూరి మాల్యాద్రి, మాలకొండయ్య , శీను, వరలక్ష్మి ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు