అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై అవగాహన సదస్సు
కేంద్రప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం, అభివృద్ది, భద్రత కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నవి. లింగ వివక్షతను రూపు మాపడానికి బేటిబటావో-బేటి పడావో పథకాన్ని బాలికల విద్య, ఉపాధి, వివాహ విషయంలో తల్లితండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సుకన్య సమృద్ది యోజన, మహిళల భద్రత, రక్షణ సహాయం అందించడానికి సభా కేంద్రాల ఏర్పాటు, మహిళల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషణా అభియాన్ కార్యక్రమం, గర్భవతులకు మాతృ వందన కార్యక్రమం ద్వారా మెటర్నటీ ఆర్ధిక ప్రయోజనం కలుగజేయడంజరుగుతున్నది. 2013 నుండి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా మాతృత్వ మరణాలు 26.9 శాతం వరకు తగ్గడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌అవుట్ రీచ్ బ్యూరో, నెల్లూరు-ప్రకాశం జిల్లాల కోట మండల యంత్రాంగం సహకారంతో నేడు స్తానిక జెడ్పిపి బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్దులకు వ్యాసరచన పోటీలు, రంగోలి, అంగన్వాడీ కార్యకర్తలతో పోషకాహార ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకు ముందు విద్యార్ధులు, అంగన్వాడీ కార్యకర్తలు, అధికారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ క్షేత్రప్రచార అధికారి బి.తారక్ ప్రసాద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శైలజ, సబ్ రిజిస్టార్ సుల్తాన్ బాషా, ఎం.ఆర్.2 మల్లికార్జున, సిడిపిఒ హెనా సృజన, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.మాలకొండారెడ్డి, సీనియర్ న్యాయవాది గోపాల్‌రెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రటరి వెంకట నారాయణ, న్యాయవాది అనురాద, ఇంచార్జి హెచ్.ఎం., సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు. విద్యార్దులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.