నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం,  వై.యస్.ఆర్. జలకళ వాహనాన్ని అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు.

సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు 
వచ్చే నాలుగేళ్లలో 2లక్షల  బోర్లు తవ్వి౦చటమే ఈ పధకం వైఎస్ఆర్ జలకళ ముఖ్య ఉద్దేశ్యం.

వైఎస్సార్‌‌ జలకళ కోసం 2,340 కోట్లు కేటాయింపు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుంది.

 భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో లేదా బోర్లు వైఫల్యం చెందిన సమయంలో తిరిగి బోరు వేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు "వై.యస్.ఆర్. జలకళ" ఒక వరం.

 వైయస్సార్ జలకళ ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ బోర్లు వేయడంతో పాటు, చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు బిగించడం జరుగుతుంది.

 వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రైతుల ఆశలన్నీ ఫలిస్తున్నాయి.

 రైతు భాందవుడు స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి  గారి కృషి ఫలితమే మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందించగలుగుతున్నాం.

 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో అండగా నిలిచి, రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు.