జవహర్ భారతి కళాశాలలో ప్రారంభమైన అథ్లెటిక్ మీట్ పోటీలు. 




కావలి మేజర్ న్యూస్: కావలి జవహర్ భారతి కళాశాలలో 2024-20 25 విద్యా సంవత్సరానికి అథ్లెటిక్ మీట్ పోటీలు బుధవారం డాక్టర్. డి.ఆర్. క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జవ హార్ భారతి డిగ్రీ కళాశాల క్రీడాకారులు జవ హార్ భారతి జూనియర్ కళాశాల క్రీడాకారులు జవ హార్ భారతి నర్సింగ్ కళాశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వదయ రెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం క్రీడలను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమై అది కాకుండా పాల్గొనడం ఆడడం ముఖ్యమని వారు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ బి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కళాశాల క్రీడలకు పుట్టినిలని క్రీడల్లో రాణించటానికి కళాశాలలో కావలసిన సదుపాయాలు ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, క్రీడల వలన విద్యార్థుల్లో శారీరిక దృఢత్వం దాని ద్వారా ఆత్మస్వర్యము, మనోధైరము ఏర్పడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో  జవహర్ భారతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ రాజ్ రాజ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్తేరుబ్యులా, జవ హార్ భారతి డిగ్రీ కళాశాల స్వయం ఉపాధి కోర్సుల సంచాలకులు డాక్టర్ ఆర్.మాల్యాద్రి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు డాక్టర్. పి.ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జయప్రదంగా జరిగాయి.