వేడుకగా కామాక్షమ్మ అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ
వేడుకగా కామాక్షమ్మ అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ
* అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
* అమ్మ ఆశీసులు ప్రజలందరిపై ఉండాలి
కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జొన్నవాడ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, పూలు, పండ్లతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వేద పండితులు పూర్ణ కుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలోకి చేరుకున్న ఎమ్మెల్యే.. పవిత్ర ఆషాడ మాస సారెను అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.. ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ జొన్నవాడ ఆలయంలో పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా తొలిసారిగా అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయన్నారు. వచ్చే సంవత్సరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే విధంగా కామాక్షి అమ్మవారి ఆలయంలో కూడా సారె సమర్పణ వేడుకలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. అమ్మవారి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ సర్పంచ్ పెంచలయ్య, బుచ్చిరెడ్డి పాళెం రూరల్ మరియు అర్బన్ టిడిపి మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎం వి శేషయ్య, మండల సీనియర్ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, మినగల్లు సర్పంచ్ పూజిత, ముఖ్య నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఆవుల వాసు, జెట్టి రాజగోపాల్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు పెంచలయ్య, సుధాకర్ లతో పాటు బిజెపి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.