భద్రత పై అవగాహన కల్పించిన సూళ్లూరుపేట అర్. పి.ఎఫ్ సిఐ శేషాద్రి
భద్రత పై అవగాహన కల్పించిన సూళ్లూరుపేట అర్. పి.ఎఫ్ సిఐ శేషాద్రి .
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
వెళుతున్న రైళ్ల పై రాళ్లు వేయడం, రన్నింగ్ లో రైలు ఎక్కడం , రైల్వే ట్రాక్ ను దాటడం
వంటి ప్రమాదకరమైన చర్యలు పై అవగాహన కల్పిస్తూ సూళ్లూరుపేట ఆర్.పి.ఎఫ్ పోలీసులు
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
గురువారం రైల్వే పోలీస్ లు ముందుగా రైల్వే ప్లాట్ఫారం
పై ఉన్న ప్రయాణికులకు కొన్ని సూచనలు అందించారు , రైలు ప్రయాణం లో ఎలాంటి
జాగ్రత్తలు పాటించాలో అవగాహన కల్పించారు, ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ట్రాక్ ప్రక్కనే ఆడుకుంటూ వెళుతున్న రైళ్ల పైన రాళ్లు విసరడం జరుగుతుందని దీని వల్ల ప్రయాణికులకు గాయాలు అవుతున్నాయని ఇది పెద్ద నేరమని అవగాహన కల్పించారు.
అలాగే రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయం లో ట్రాక్ దాటకుండా పాటించాల్సిన
నియమనిబంధల పై కూడా అవగాహన కల్పిచారు,దీంతో పాటుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
లు ఉన్న చోట వాటిని ఉపయోగించకుండా ట్రాక్ దాటి వెళుతున్న వారిని నిలిపి
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఉపయోగించాలను విజ్ఞప్తి చేస్తూ అవగాహన కల్పించారు, రైల్వే సీఐ శేషాద్రి సారథ్యం లో ఎస్సై లు శ్రీనివాసులు రెడ్డి,తారాసింగ్ అద్వర్యం లో ఈ డ్రైవ్ ను
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.