తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పలువురు నూతన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి,జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ఏడుగురు గ్రామ వాలంటీర్లకు స్థానిక ప్రజా ప్రతినిధులు నియామక పత్రాలను అందించారు.ఇందులో చేరివి సచివాలయం పరిధిలో శివాని,ధనలక్ష్మి, కన్నవరంలో రేఖ,మీనా,కొత్తమారికుప్పంలో గోమతి,ఇలరశి,శిరణబూదూరు సచివాలయం పరిధిలో సోనియా తదితరులు నియామక పత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది అర్హులకు అందేటట్టు చూడాల్సిన బాధ్యత గ్రామవాలంటీర్ల పై ఉందన్నారు.ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ప్రజలకు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి రమణకుమార్,సీనియర్ అసిస్టెంట్ శివయ్య,జూనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్,ఎంపిటిసి మోహన్ రెడ్డి,సుధాకర్, శ్రీరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.