సోమశిల ప్రాజెక్టు దక్షిణ కాలువ చైర్మన్ గా వేలూరు కేశవ చౌదరి నియామకం..

క్రమశిక్షణ అంకితభావం విధేయతలకు పెద్దపీట.. 




ఆదేశించిన పార్టీ అధిష్టానం..


చేజర్ల, మేజర్ న్యూస్ 


ఇటీవల 14తేదీ జరిగిన సాగునీటి సంఘం అన్నికలు జరిగాయి.అందులో సోమశిల ప్రాజెక్ట్ దక్షిణ  కాలువ4 ఎల్ నుండి 9ఎల్ కి అధ్యక్షుడుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైన కావడమైనది మండల కేంద్రమైన చేజర్ల సంఘమిత్ర కార్యాలయంలో నిర్వహించిన కమిటీ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ నియామక సమావేశంలో నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన వేలూరు కేశవ చౌదరిని పార్టీ అధిష్టానం ఆదేశాలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారం తో ఎన్నికల అధికారులు కమిటీ ప్రెసిడెంట్ గా నియామకం చేశారు..రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు..వేలూరు కేశవ చౌదరి గారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు..