ప్రమాదంలో జలాశయాలు సాంకేతిక సిబ్బంది నియమించండి
ప్రమాదంలో జలాశయాలు సాంకేతిక సిబ్బంది నియమించండి
జిల్లాల హౌసింగ్ స్కాం పై విజిలెన్స్ విచారణ పారదర్శకంగా లేదు .
హౌసింగ్ అవినీతిపై సిఐడి విచారణ జరిపించాలి
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ బహిరంగ లేఖ రాశారు
జలవనరుల శాఖ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కన్నయ్య నాయుడు సోమశిల డ్యామ్ ను పరిశీలించి డ్యామ్ గేట్లు రోప్ లు దెబ్బతిన్నాయి .సాంకేతిక సిబ్బంది లేరు. ఇలాగైతే తుంగభద్ర డ్యామ్ కు పట్టిన గతే... అని అధికారులను హెచ్చరించారు
వాస్తవానికి సోమశిల కండలేరు రాళ్లపాడు ప్రాజెక్టులలో ఇవే సమస్యలు నెలకొని ఉన్నాయి. జిల్లాలోని అన్ని చెరువులు పంట కాలువల నిర్వహణకు సాంకేతిక సిబ్బంది లేరు
రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల నిర్వహణకు నిధులు కేటాయించడం లేదు.
సాంకేతిక సిబ్బంది లాక్ ఆపరేటర్లు గేట్ ఆపరేటర్లు లస్కర్లు ఇలాంటి ఉద్యోగాలు ఉమ్మడి జిల్లాలో 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి.
ప్రభుత్వం కీలకమైన ఉద్యోగాలు భర్తీ చేయకుండా
నిధులు విడుదల చేయకుండా అధికారులను బాధ్యులను చేస్తే సరిపోదని నిధులు కేటాయించాలని ఉద్యోగాలు భర్తీ చేయాలని రమేష్ లేఖలో పేర్కొన్నారు
. గత ఐదు సంవత్సరాలలో చేపట్టిన గృహ నిర్మాణాలు లో భారీ అవినీతి చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ కమిటీ విచారణ జరిపినా అందులో పారదర్శకత లేదు .
నెల్లూరు కొండ్లపూడి లేఔట్ లో1 కోటి 59 లక్షలు దుర్వినియోగం జరిగినట్లు 17_ 10 _2022న అప్పటి విజిలెన్స్ అధికారులు ఎండి కార్యాలయంలో నివేదికను సమర్పించారు .
అయితే అవినీతిపరులను కాపాడడం కోసం దుర్వినియోగం అయిన మొత్తం 1కోటి 59 లక్షల ను కేవలం 5 లక్షల 42081 రూ పాయలుగా ఎండి కార్యాలయంలో మార్చేశారు.
ప్రస్తుత విజిలెన్స్ అధికారులు గృహాలు పొడవు వెడల్పు లాంటి ఫిజికల్ ప్రోగ్రాం మాత్రమే చేపట్టారు అందులోనూ 110 కోట్లు అవినీతి" జరిగిందని నివేదిక ఇచ్చారు
వాస్తవానికి వినియోగించిన స్టీలు సిమెంటు ఫౌండేషన్ లోతు లాంటి అంశాలను పరిగణలోనికి తీసుకోలేదు
మీరు ముఖ్యమంత్రిగా నియమించిన విజిలెన్స్ కమిటీ నాణ్యత ప్రమాణాలు పాటించ కుండ దర్యాప్తు జరిపారు.
వాస్తవాలు వెలుగులోకి రావడం కోసం ఉదాహరణగా కొండ్లపూడి లే అవుట్ ను యూనిట్ గా తీసుకొని సిఐడి అధికారుల చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని రమేష్ డిమాండ్ చేశారు
హౌసింగ్ ఎం డి కార్యాలయంలో సంపూర్ణ ప్రక్షాళన జరుపాలి.
సిఐడి లోతుగా దర్యాప్తు జరపి అవినీతి సొమ్మును రాబట్టాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ ద్వారా రమేష్ కోరారు. ఈ కార్యక్రమం లో బుధవారపు బాలాజీ, సోమా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.