వికాస్ ఆరోగ్య దీపికకు దరఖాస్తు చెసుకోoడి -- కర్తo
వికాస్ ఆరోగ్య దీపికకు దరఖాస్తు చెసుకోoడి -- కర్తo
వికాస్ ఆరోగ్య దీపిక పధకం కింద పేదలకు ఉచితంగా మందులను అందించనున్నాము. ఈ పధకం కింద మందులు ఉచితంగా పొందాలనుకొనే 14 వ డివిజన్ ప్రజలు రేపటి నుంచి దరఖాస్తూ చేసుకోవాలని కోరారు కర్త0 ప్రతాప్ రెడ్డి.. ఈ రోజు ఆయన 14వ డివిజన్ లో పర్యటించి తాను స్వయంగా చేపడుతున్న ఆరోగ్య దీపిక పధకం గురించి ప్రజలకు తెలియజెప్పారు. డాక్టర్ వ్రాసిచ్చిన మందుల చీటీని, ఆధార్ కార్డు ను వికాస్ స్కూల్ లో అందజేయాలని, వారిలో పేదలను గుర్తించి ప్రతి నెల వారికి మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. వృద్ధులు,అనారోగ్యంతో బెడ్ లో ఉండే వారికి అవసరమైన డ్రెస్సింగ్, ఇంజెక్షన్లు తదితర వైద్య సేవలను వారి ఇంటివద్దే అందింస్తామన్న కర్త0 అర్హులైన వారు ఈ పదకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.