మన్నవ ఆశ్రిత చౌదరి జన్మదిన సందర్భంగా అన్నదానం.
మన్నవ ఆశ్రిత చౌదరి జన్మదిన సందర్భంగా అన్నదానం.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర మనుమరాలు అశ్రిత చౌదరి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఒకరోజు అన్నా క్యాంటీన్లో సుమారు 500 మందికి పైగా అన్నదానానికి విరాళాన్ని అందించారు. కావలి పట్టణంలో మన్నవ కుటుంబ సభ్యులు ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. అంతేకాకుండా కరోనా కష్టకాలములో అనేకమంది నిరాశ్రయులైన పేద గిరిజన లకు తన వంతుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే వారి సతీమణి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు కొంత నగదు బహుమానం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ద్వారా అందించడం అందరికీ తెలిసిన విషయమే, ఈ కుటుంబం పేద ప్రజల ఆదర అభిమానాలు పొందగోరుచున్నారు. వీరిని దేవుడు ఎల్లప్పుడూ.. దీవించాలని పేద ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.