పేటలో పరమశివునికి అన్నాభిషేకం భక్తులకు అన్నప్రసాదం పంపిణి.




రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

పట్టణం లో రైల్వే స్టేషన్ సమీపంలో వెలసివున్న శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం సందర్భముగా శుక్రవారం పరమేశ్వరునికి అన్నాభిషేకం చేశారు,ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ శర్మ  అద్వర్యం లో ఆలయ మాజీ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి సహాయ సహకారాలతో జరిగిన ఈ అన్నాభిషేకం మహోత్సవమును  పెద్ద సంఖ్యలో భక్తులు కనులారా వీక్షించి తరించారు,అనంతరం స్వామి వారికి అన్నాభిషేకం చేసిన అన్నం తో ప్రత్యేకంగా అలంకారం చేశారు, అలంకారం చేసిన అన్నంతో   భక్తులకు అన్నప్రసాదాలు గా  పంచి పెట్టారు , ఉభయదాతలు కర్లపూడి రమేష్ దంపతుల సహకారం తో జరిగిన ఈ వేడుక అనంతరం  ఆలయం వద్ద వృద్దులకు  మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి చేతులు మీదుగా దుప్పట్లు పంపిణి చేశారు, ఈ వేడుకలో మాజీ బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.